క్షేత్ర స్థాయిలో రెవెన్యూ సమస్యలు తగ్గాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ సదస్సులు, పల్లె నిద్ర, ప్రజా సమస్యల పరిష్కార వేదిక తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల నియోజకవర్గ ప్రత్యేక అధికారులు రెవెన్యూ సదస్సులలో అందిన వినతుల పరిష్కారం స్థితిని పరిశీలిస్తారని అన్నారు.