మాతా, శిశు మరణాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా అన్ని వర్గాలూ కృషి చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అదనపు సంచాలకుడు డా. కెవిఎస్ అనిల్ కుమార్ అన్నారు. మాతాశిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గురువారం ఆయన పార్వతీపురంలోని స్థానిక ఎన్జీఓ హోంలో ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.