పార్వతీపురం: సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై సమీక్ష

65చూసినవారు
పార్వతీపురం: సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంపై సమీక్ష
పార్వతీపురం పట్టణంలో సుపరిపాలన తొలి అడుగు, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై పార్టీ నాయకులతో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శనివారం సమీక్షించారు. పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి గత మూడు రోజులుగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుండి వచ్చిన స్పందన, ప్రజలు ప్రస్తావించిన సమస్యలు, కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజల అభిప్రాయం గురించి ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్