పార్వతీపురం: ఎస్జీటీల కౌన్సెలింగ్‌ వాయిదా

65చూసినవారు
పార్వతీపురం: ఎస్జీటీల కౌన్సెలింగ్‌ వాయిదా
ఉపాధ్యాయుల బదిలీల్లో చివరి అంకమైన ఎస్జీటీల కౌన్సెలింగ్‌ బుధవారానికి వాయిదా పడింది. మాన్యూవల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని మంత్రి లోకేశ్‌ను పార్వతీపురంలో ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. అనంతరం టీడీజీ ఎమ్మెల్సీల వినతితో ఎస్జీటీలకు వెబ్‌ కౌన్సెలింగ్‌ కాకుండా మాన్యూవల్‌గా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈనేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు మంగళవారం జడ్పీ కార్యాలయం వద్ద అధికారులు ఏర్పాట్లుచేశారు.

సంబంధిత పోస్ట్