పార్వతీపురం: శ్యామలాంబ జాతరనుసమన్వయంతో విజయవంతం చేయాలి

62చూసినవారు
పార్వతీపురం: శ్యామలాంబ జాతరనుసమన్వయంతో విజయవంతం చేయాలి
సాలూరులో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరిగే శ్యామలాంబ అమ్మవారి జాతరను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ కోరారు. శ్యామలాంబ జాతర నిర్వహణపై సంబంధిత అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 15 ఏళ్ల తరువాత జరుగుతున్న శ్యామలాంబ జాతరకు పెద్దఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. జాతర జరిగే మూడు రోజులూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు చోటుచేసుకోకుండా, సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు

సంబంధిత పోస్ట్