పార్వతీపురం: మే 1 నుండి వేసవి క్రీడా శిక్షణా తరగతులు

61చూసినవారు
పార్వతీపురం: మే 1 నుండి వేసవి క్రీడా శిక్షణా తరగతులు
పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వచ్చే నెల 1 నుండి 31వ తేదీ వరకు వివిధ క్రీడాంశాలలో వేసవి శిక్షణా తరగతులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మన్యం జిల్లా క్రీడా అభివృద్ధి సాధికార అధికారి యస్. వెంకటేశ్వర రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలు అర్హులని పేర్కొన్నారు. క్రీడాంశములు, వేదికలకు సంబంధించి ప్రతిపాదనలు శాప్ ఆమోదంకు పంపించామని అన్నారు.

సంబంధిత పోస్ట్