అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల సర్వేను మార్చి 23వ తేదీ నాటికి పూర్తి చేయాలని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. వివిధ శాఖల ప్రగతిని కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సమీక్షించారు. స్టేజ్ అప్ గ్రేడ్ విధిగా జరగాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇనుము ధర తగ్గుదల ఉందని, ఇసుక లభ్యంగా ఉందని, ఉపాధి హామీ క్రింద వేతనాలు పెరిగాయని, మరుగుదొడ్లు లేని వారికి మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు.