పార్వతీపురం: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

68చూసినవారు
పార్వతీపురం: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పార్వతీపురం మన్యం జిల్లా వారి ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) బైపాస్ రోడ్‌లో గల భాస్కర్ డిగ్రీ కళాశాలలో జరగబోయే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్