మంచి సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని మంత్రి సంధ్యారాణి అన్నారు. సోమవారం పార్వతీపురంలోని సాయిస్ ప్యాలస్ లో ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధత సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా ఉంచి అవమానపరిచిన వైసీపీ ప్రభుత్వ తీరును ప్రతి ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలని అన్నారు.