రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాని ముఖంలో నవ్వు చూడడమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకు తగ్గట్టుగా ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛను అందించడం జరుగుతుందిని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. ఈ నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. శనివారం పురపాలక సంఘం 28వ వార్డులో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛనులను పంపిణీ చేశారు.