పార్వతీపురం: స్వచ్చ ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

52చూసినవారు
పార్వతీపురం: స్వచ్చ ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
రేపు నిర్వహించే స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై కలెక్టర్ శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరగాలని అన్నారు. బీట్ ది హీట్ శీర్షికన ఈ నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్