స్వాతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగింది. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా చిత్రపటానికి పూలమాలను వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. నంద్యాల జిల్లా సంజమల మండలంలోని నొస్సం గ్రామంలో వడ్డె సుబ్బన్న, సుబ్బమ్మ దంపతులకు జన్మించారన్నారు.