పార్వతీపురంలో వయోవృద్ధులు, దివ్యాoగులు, హిజ్రాల సంక్షేమ ఉప సంచాలకులు ఆదేశాల మేరకు యోగాoద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పార్వతీపురం జూనియర్ కళాశాల మైదానంలో దివ్యాoగులు, హిజ్రాలతో నీడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ పి. వేణు గోపాలరావు ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీడ్ సంస్థ డైరెక్టర్ వేణు గోపాలరావు మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు, వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఉపయోగ పడుతోందని అన్నారు.