జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 116 కేసులను ఇరువురి అంగీకారంతో రాజీ చేయడం జరిగిందని పార్వతీపురం మన్యం జిల్లా రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్. దామోదరరావు అన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి మార్గదర్శిగా ఉపయోగపడుతుందన్నారు.