విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నైరుతి రుతుపవనాల సంసిద్ధతపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.