హీరో బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ సమక్షంలో ముందస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. చినబొండపల్లిలో సోమవారం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం అనంతరం పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. మంత్రి లోకేష్ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే విజయచంద్రకు తినిపించారు. నందమూరి బాలకృష్ణ గారికి అడ్వాన్స్డ్ బర్త్ డే విషెస్ తెలిపారు.