పార్వతీపురం: శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర

54చూసినవారు
పార్వతీపురం: శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర
నేరాలను అదుపుచేయడంలో, నేరస్థులను కనిపెట్టడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు క్రియాశీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ ఎస్‌వి మాధవ్‌ రెడ్డి అన్నారు. శనివారం పార్వతీపురం ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాచిపెంటకు చెందిన నల్లి షణ్ముఖరావు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం నేరాల అదుపునకు సహకరించేందుకు ఎస్పీ కార్యాలయంలో రూ. 1. 20లక్షలు విలువ చేసే 40 సీసీ కెమెరాలు పరికరాలను ఎస్పీకి అందించారు.

సంబంధిత పోస్ట్