ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు రెడ్డి వేణు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం ఆర్టీసీ డిపో ఆవరణలో డ్రైవర్లతో కలిసి నిరసన తెలియజేశారు. డ్రైవర్కు టెండర్లో, అగ్రిమెంట్లో పేర్కొన్న విధంగా లేబర్ చట్టాలు, వేతనాలు, జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామన్నారు.