పార్వతీపురం: రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు

85చూసినవారు
పార్వతీపురం: రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
సీతానగరం మండలం మరిపివలస మలుపు వద్ద బైక్ను కారు ఢీ కొట్టడంతో భార్యభర్తలకి గాయాలయ్యాయి. పార్వతీపురం పట్టణంలోని బెలగాం అగ్రహారం వీధికి చెందిన పాలంకి సత్యప్రసాద్, భార్య జ్యోతి ద్విచక్ర వాహనంపై గురువారం విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు 108 వాహనం ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యంనిమిత్తం విశాఖపట్టణం కేజీహెచ్కు రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్