ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్వతీపురం జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు పాల్గొని మాట్లాడారు. 90 సంవత్సరాల నుంచి రైతుల సమస్యల మీద, వ్యవసాయ రంగ సమస్యలపై పోరాడుతూ వస్తున్నట్లు తెలిపారు.