వెనుకపడ్డ పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల కొత్తవలస శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పీఎం ఉషా పథకం కింద రూ. 500 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన ప్రభుత్వ బాలికల వసతి గృహం నిర్మాణానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి స్వలాభాలకు ప్రోత్సహించిందన్నారు.