జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షల హాల్ టికెట్లను కళాశాల లాగిన్ లోను, ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని పార్వతీపురం మన్యం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి డి. మంజులవీణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థినీ, విద్యార్థులు తమ హాల్ టికెట్లను బోర్డు వెబ్సైట్లో ఆధార్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు.