సంక్రాంతి సంబరాలు వేడుకలలో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శనివారం నిర్వహించిన ముగ్గుల పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. మహిళలు, చిన్నారులు ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయ ముఖద్వారం నుంచి ప్రధాన రహదారి గేటు వరకు దారిపొడుగునా వేసిన రంగవల్లులను జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తిలకించారు.