యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పార్వతీపురం మన్యం జిల్లాలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలు జరిగాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తేదీన నిర్వహిస్తున్న నేపథ్యంలో దానికి సన్నాహక చర్యలు, యోగ అభ్యాసన క్రింద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 3,800 ప్రదేశాల్లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించగా, ప్రతి చోటా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్చందంగా వచ్చి యోగాలో పాల్గొనడం జరిగింది.