మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ తీవ్రంగా స్పందించారు. మహిళలు నిరసన చేస్తే YCP నేతలకు అవమానంగా కనిపిస్తున్నదా? వారి భాష, ప్రవర్తన దిగజారాయి. సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలతో పోల్చి తక్కువ చేశారు. తల్లి, చెల్లిని వదిలేసిన జగన్‌నే వీరు ఆదర్శంగా తీసుకుంటున్నట్లు ఉంది. మహిళల జోలికొస్తే చట్టపరంగా చర్యలు తప్పవని లోకేశ్ సోమవారం హెచ్చరించారు.