పార్వతీపురంలో ఏర్పాటు చేసిన ఇన్నోవేటివ్ హబ్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం షైనింగ్ స్టార్స్ కార్యక్రమం వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ప్లానిటోరియంతో పాటు జీవ, రసాయన, భౌతిక, భౌగోళిక, సాంఘిక శాస్త్రాల పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ప్రత్యక్ష పరిజ్ఞానానికి ఉపయోగపడుతుందన్నారు. త్వరితగతిన విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.