పార్వతీపురం: పీఎం జన్ మన్ నిర్మాణ పనులు పూర్తిచేయాలి

82చూసినవారు
పార్వతీపురం: పీఎం జన్ మన్ నిర్మాణ పనులు పూర్తిచేయాలి
పార్వతీపురం ఐటీడీఎ పరిధిలో చేపడుతున్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబరులో గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఐటీడీఎ పరిధిలో నిర్మితమవుతున్న పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలపై అధికారులు మరింత ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్