పార్వతీపురం: ప్రాథమిక చికిత్స సకాలంలో అందించాలి

65చూసినవారు
పార్వతీపురం: ప్రాథమిక చికిత్స సకాలంలో అందించాలి
అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయస్థితి నుండి తప్పించవచ్చని ఆరోగ్యశాఖ పార్వతీపురం మన్యం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్మోహనరావు పేర్కొన్నారు. పార్వతీపురం మండలం పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో వినియోగించే పరికరాలు, కిట్లు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్