సీతానగరం మండల కేంద్రంలో కోపరేటివ్ బ్యాంక్‌లో చోరీ యత్నం జరిగిందని పోలీసులు తెలిపారు. బ్యాంకులో పనిచేస్తున్న ఎటెండర్ బుధవారం ఉదయాన్నే డ్యూటీ సమయానికి వచ్చేసరికి తలుపులు పగలగొట్టి ఉండటంతో వెంటనే మేనేజర్ సూర్యనారాయణకు సమాచారం మిచ్చారు. మేనేజర్ పై అధికారులకు తెలియజేసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పార్వతీపురం రూరల్ సీఐ, ఎస్‌ఐ , క్లూస్‌టీమ్ ఆధ్వర్యంలో సంఘటన స్థలాన్ని పరిశీలించారు.