భారతదేశం కోసం అనునిత్యం శ్రమిస్తూ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ తమ ప్రాణాలను సైతం అర్పిస్తున్న భారత సైనికుల సేవలు అభినందనీయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. శుక్రవారం పట్టణంలో పలు ప్రాంతాలలో భారత సైనికులకు మద్దతుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. భారత్ పై దాడి చేసిన పాకిస్తాన్‌ను ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎదురుదాడి చేసి విజయవంతం చేసిన సైన్యంకు అభినందనలు తెలిపారు.