పార్వతీపురం: భారత్ జవాన్లకు మద్దతుగా రేపు సంఘీభావ ర్యాలీ

72చూసినవారు
పార్వతీపురం: భారత్ జవాన్లకు మద్దతుగా రేపు సంఘీభావ ర్యాలీ
ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టిన మన భారత సైనికులకు సంఘీభావంగా శుక్రవారం ఉ. 10గంటలకు పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు జాతీయ జెండాలు పట్టుకొని సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరగబోయే ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్