ఈ నెల 19 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతి నాయడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్-ఎంబ్రాయిడరీ లోయర్, హయ్యర్ గ్రేడ్లలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు, హ్యాం డ్లూమ్ వీవింగ్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 19 నుంచి 28 వరకు నిర్వహి స్తున్నట్లు తెలిపారు.