ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం పట్ల మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలైన సంగతి విదితమే. ఈమేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.