మన్యం జిల్లాలోని తోటపల్లి, ఏనుగుకొండ, పెద్దగెడ్డ, వీరఘట్టం, కూర్మసాగరం ప్రాంతాలు బోటింగ్ కు అనుకూలమని, కావున దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఆయన ఛాంబరులో అటవీ, పర్యాటక శాఖ కార్యకలాపాలపై సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఐదు ప్రాంతాల్లో స్పీడ్ బోటింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.