ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడమే పోలీసుల బాధ్యత అని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. సోమవారం పార్వతీపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 9 ఫిర్యాదులు అందినట్టు ఆయన తెలిపారు. ఫిర్యాదులను సత్వరమే పరష్కరించి న్యాయం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎక్కువగా నకిలీ పత్రాలు, కుటుంబ తగాదాలు, ఆన్‌లైన్ మోసాలు, భూ సమస్యలు వచ్చినట్లు చెప్పారు.