పార్వతిపురం మన్యం జిల్లాలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు భానుడి సెగలతో ఉన్న వాతావరణం సాయంత్రం వేళ వానతో చల్లబడింది. ఈ చల్లదనం ప్రజలకు కొంత ఊరట కలిగించింది. మధ్యాహ్నం భానుడి ప్రతాపం సాయంత్రం చల్లని వాతావరణం ఉండటంతో ప్రజలు ఉపశమనాన్ని పొందారు.