ఒడిశా నుంచి తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు పాచిపెంట ఎస్సై వెంకట సురేష్ మంగళవారం తెలిపారు. మహమ్మద్ సఫీక్(కర్ణాటక) దివ్యాన్ శుక్లా (ఉత్తర ప్రదేశ్) ఓమశుక్లా(ఉత్తర ప్రదేశ్)లు వేర్వేరు సంచుల్లో గంజాయిని సోమవారం తరలిస్తుండగా పి. కోనవలస చెక్పోస్టు సమీపంలో తనిఖీ చేయగా 30 కిలోలు గుర్తించి స్వాధీనం చేసుకునికేసు నమోదుచేశారు. ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.