సాలూరు: జారి పడిన ఎక్స్‌కవేటర్‌.. నిలిచిన విద్యుత్‌ సరఫరా

56చూసినవారు
సాలూరు: జారి పడిన ఎక్స్‌కవేటర్‌.. నిలిచిన విద్యుత్‌ సరఫరా
ట్రాలీ లారీపై తరలిస్తున్న ఎక్స్‌కవేటర్‌ జారి పడి విద్యుత్‌ స్తంభంపై పడడంతో ఓ గిరిజన గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పట్టుచెన్నారు మార్గంలో ట్రాలీ లారీపై ఎక్స్‌కవేటర్‌ను తరలిస్తున్నారు. ఘాట్‌ రోడ్డులోని కొండంగివలస సమీపాన గల ఓ మలుపు వద్ద ఎక్స్‌కవేటర్‌ ట్రాలీ నుంచి జారి పడి ఓ విద్యుత్‌ స్తంభంపై పడింది. ఈ ప్రమాదంతో ఎవరికి గాయాలు కాలేదని సోమవారం స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్