సీతంపేట ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ కెవిఎస్‌ఎన్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ నుంచి ఇఎన్‌సి కార్యాలయం నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఇఇ రమాదేవికి నెల్లూరు బదిలీ అయింది. ఈ సందర్భంగా ఇఇ కూమార్ మాట్లాడితూ ఇంజినీరింగ్ పనులను సకాలంలో నాణ్యతగా చేస్తామన్నారు. సీతంపేట ఐటిడిఎ డిప్యూటీ డిఇగా జి.రామ్మోహనరావు బాధ్యతలు స్వీకరించారు. కెఆర్ పురం నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ పనిచేసిన రవి ప్రసన్నకుమార్ కెఆర్ పురం ఐటిడిఎకు బదిలీపై వెళ్లారు.