సీతానగరంలోని సువర్ణముఖి నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గురువారం ముడుపుల పూజలు నిర్వహించారు. స్వామి వారిని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీను శాస్త్రి వివిధ రకాల పుష్పాలతో అలకంరించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.