శిథిలావస్థకు చేరుకున్న ములక్కాయవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

62చూసినవారు
మక్కువ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ములక్కాయవలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోతుండగా గోడలు బీటలు వారాయి. వర్షాల సమయంలో తరగతుల గదుల్లోకి నీరు కారుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రతలేని భవనంలోనే విద్యార్థులు చదువుతున్నారు.

సంబంధిత పోస్ట్