రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, కారణాలను గుర్తించేందుకు జాతీయ రహదారిపై 64 సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. హిట్ అండ్ రన్ కమిటీ సమావేశం కలెక్టర్ ఛాంబర్‌లో బుధవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లు, నేరాలు జరిగే చోట్లలో సిసి కెమేరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.