దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలందరికీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం విజయనగరం మంత్రి క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దీపావళి నుండి ప్రతి ఇంట్లో దీపం 2 పథకం ద్వారా నిజమైన దీపావళి కాంతులను రాష్ట్ర ప్రజలందరికీ పంచుతుందన్నారు. ఈ దీపావళి ప్రతి ఇంట వెలుగులు నింపాలని, జీవితాలలో సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.