కొత్తపేట, కుమ్మరి వీధి ముత్యాలమ్మ గుడి దగ్గర శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయ పున ప్రతిష్ట మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసనంద సరస్వతి ఆశీస్సులతో ఆనందాశ్రమ ప్రధాన అర్చకులు మావుడూరు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరిపారు ప్రముఖ సినీనటి కరాటి కళ్యాణిచే "సీతా కళ్యాణం" హరికథ గానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.