రాజాం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈనెల 21వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ పి. సావిత్రి శనివారం తెలిపారు. ఈ మేరకు అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలు మాత్రమే https: //apkgbv. apcfss. in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినిలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.