రెల్లిగడ్డి, పిన్నలగర్రతో నిండిపోయిన కాలువ

65చూసినవారు
రెల్లిగడ్డి, పిన్నలగర్రతో నిండిపోయిన కాలువ
సంతకవిటి మండలంలోని సాయన్న గెడ్డ ఆయకట్టు రైతులకు ప్రతీయేటా కన్నీరు తప్పడంలేదు. సాయన్న గెడ్డ గత కొంతకాలంగా ఆధునీకరణకు నోచుకోక పోవడంతో ప్రతి సంవత్సరం ఖరీఫ్ రైతుకు శాపముగా మారుతుంది. ఛానల్ రైతుకు సేద్యములో ప్రతి ఏటా అపార నష్టం కలిగిస్తుంది. ఈ ఓపెన్ హెడ్ చానల్లో గుర్రపు డెక్క, పిన్నల కర్ర, రెల్లిగడ్డ నిండిపోయి సాగునీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. పిచ్చి మొక్కలు నిండిపోయి సాగునీరుకు అడ్డంకి గా మారింది

సంబంధిత పోస్ట్