జాతీయ స్థాయిలో మెరిసిన పెద్దలింగాలవలస వాసి

64చూసినవారు
జాతీయ స్థాయిలో మెరిసిన పెద్దలింగాలవలస వాసి
రేగిడి మండలం పెద్దలింగాలవలస గ్రామానికి చెందిన రెడ్డి గౌరు నాయుడు ఆల్ ఇండియా యోగా ఛాంపియన్షిప్ లో ప్రతిభ కనబరిచారు. ఈనెల 8న కలకత్తాలో జరగిన కల్చర్ ఫెడరేషన్ 35వ జాతీయ యోగాసనా ఛాంపియన్- 2025 పురుషుల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే జాతీయ ట్రెడిషనల్ యోగాసన పోటీల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా ఆయనను స్థానికులు మంగళవారం అభినందించి సత్కరించారు.

సంబంధిత పోస్ట్