రాజాం పట్టణంలో ఓ దుకాణంలో పని చేస్తున్న బి. జగదీష్ (20) అనే యువకుడు తాను పని చేస్తున్న దుకాణ యజమానికి డబ్బులు అవసరమని దొరికిన చోటల్లా అప్పులు చేసి ఇచ్చాడు. తిరిగి ఆ యజమాని ఐపీ పెట్టి పరారవడంతో రుణదాతలు ఒత్తిడి పెంచడం, బంధువులు ఏమంటారో అనే భయంతో ఈనెల 15న గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని రాజాం ప్రభుత్వాసుపత్రికి ఆతర్వాత శ్రీకాకుళం కు తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు.