ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ న్యాయం, ఆర్థిక విషయాలు, సామాజిక, రాజకీయ, నిమ్నన జాతుల అభ్యున్నతికి కృషి చేశారని దళితబహుజన జేఏసీ ఉత్తరాంధ్ర అధ్యక్షుడు, డీవీఎంసీ సభ్యుడు మజ్జి గణపతి, మాజీ జడ్పిటిసి బొత్స వాసునాయుడు, దళిత సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. గణపతి రావు పిలుపునిచ్చారు. సోమవారం వంగరలోని అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.