అరసాడ గ్రామంలో కాలువలు పుడికతీయకపోవడంతో కొన్ని నెలల నుండి దుర్గంధం వెదజల్లుతూ, దోమ కాటుకు గురైన అనేకమంది అనారోగ్యాలకు గురవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్ని పర్యాయాలు మొరపెట్టినా పట్టించుకోవడంలేదని శుక్రవారం గ్రామ ప్రజలు చెబుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని కాలువలు పుడికలు తీసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.